Header Banner

ఎమ్మెల్సీగా గెలిచిన నాగబాబు.. పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు! అధికార పథంలో ప్రజా సేవకు సిద్ధం!

  Fri Mar 14, 2025 16:18        Politics

ఏపీలో తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి తరఫున నామినేషన్లు వేసిన ఐదుగురు అభ్యర్ధులు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీకి చెందిన కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రతో పాటు బీజేపీ అభ్యర్ధి సోము వీర్రాజు, జనసేన అభ్యర్ధి కొణిదల నాగబాబు ఉన్నారు. వీరికి పోటీగా ఇతర నామినేషన్లేవీ రాకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్న కొణిదెల నాగబాబు తాను ఎమ్మెల్సీ కావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన సీఎం చంద్రబాబు, తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


అలాగే ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సేవ చేసేందుకు గాను, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నట్లు నాగబాబు తెలిపారు. తనతో పాటు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, సోము వీర్రాజుకు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నామినేషన్ సందర్భంగా తన వెన్నంటి ఉన్న జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు కూడా అభినందనలు తెలిపారు. వీరితో పాటు జనసేన కుటుంబం మొత్తానికి విడివిడిగా ఆయన అభినందనలు తెలియజేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #mlc #nagababu #winning #tweet #todaynews #flashnews #latestnews